భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీ నిన్న(సోమవారం) రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎంపీ, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ స్పందిస్తూ.. మోదీ తన ప్రసంగంలో ట్రంప్ జోక్యం గురించి ఎందుకు ప్రస్తావించలేదని మండిపడ్డారు. కాల్పుల విరమణపై కుదిరిన అవగాహన గురించి కూడా ప్రధాని వివరణ ఇవ్వలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

next post