ఏపీలో( Andhra Pradesh) అధికార టీడీపీ కూటమి భయపడుతోందా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఇబ్బందులు తప్పవని భావిస్తోందా?అందుకే ముందుగా జాగ్రత్తలు తీసుకుంటుందా? పార్టీ క్యాడర్ను హెచ్చరిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు దాటుతోంది. గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో దూకుడుగా ఉన్న నేతల అరెస్టు పర్వం కొనసాగుతోంది. అడ్డగోలుగా వ్యవహరించిన చాలామంది నేతలు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అయితే దీనిని గుణపాఠంగా తీసుకుంది టిడిపి. సోషల్ మీడియాతో పాటు బయట కూడా వీలైనంతవరకు దూకుడు తగ్గించాలని క్యాడర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వైసిపి హయాంలో దూకుడు..వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో చాలామంది నేతలు దూకుడుగా ఉండేవారు. ప్రత్యర్థుల విషయంలో నోరు పారేసుకునేవారు. సోషల్ మీడియా విషయంలో చెప్పనవసరం లేదు. శృతి మించి మాట్లాడారు. కొందరు నేతలు అయితే తిట్ల దండకం తో పాటు బూతులతో రెచ్చిపోయేవారు. అటువంటి వారంతా మూల్యం చెల్లించుకుంటున్నారు. కేసుల్లో చిక్కుకుంటున్నారు. అందుకే ఇప్పుడు టిడిపి నాయకత్వం సైతం మేల్కొంది. ఒకవేళ వచ్చి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. పార్టీ శ్రేణులకు ఇబ్బంది కలగకూడదని భావిస్తోంది. అందుకే దూకుడు తగ్గించాలని పార్టీ శ్రేణులకు స్పష్టమైన సూచనలు చేసింది టిడిపి హై కమాండ్.
అనుమానాలకు కారణాలు.. అయితే ప్రస్తుతానికి టిడిపి కూటమి( TDP Alliance ) కేవలం 10 నెలల పాలన మాత్రమే పూర్తి చేసుకుంది. ఇంకా విలువైన సమయం ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అన్న అనుమానాలు టిడిపి శ్రేణులకు కూడా కలుగుతున్నాయి. దానికి కారణాలు లేకపోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ప్రజల నుంచి ఒక రకమైన అసంతృప్తి ప్రారంభం అయింది. అయితే అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు సైతం ప్రారంభమయ్యాయి. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. ఐటీ సంస్థల సైతం క్యూ కడుతున్నాయి. అయితే ఎక్కడో ఒక అప నమ్మకం కలుగుతోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమవుతుందన్న అనుమానాలు ఉన్నాయి.* *అంచనా కష్టం..* వాస్తవానికి ప్రభుత్వ పనితీరును ఇప్పటికి ఇప్పుడు కొలవలేము. కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలే అవుతోంది. ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు అమరావతి రాజధాని పనులు తో పాటు ఇతరత్రా పాలన వ్యవహారాలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత చూడలేం. అనుకూలతను పరిగణలోకి తీసుకోలేం. అయినా సరే గత అనుభవాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన భయం ఉంది. ముఖ్యంగా 2014 నుంచి 2019 మధ్య మంచి పాలనందించినా ప్రజలు తిరస్కరించారు. 2019లో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పుష్కలంగా, రాజకీయాలకు అతీతంగా అందించినా ప్రజలు లెక్క చేయలేదు. అందుకే ఇప్పుడు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అయినా సరే లోలోపల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు పై కూడా భయం ఉంది.* *ఆ నేతలు ఇప్పుడు మూల్యం..* వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో చాలామంది నేతలు దూకుడుగా వ్యవహరించారు. సోషల్ మీడియా( social medi) వేదికగా కూడా రెచ్చిపోయారు. అటువంటివారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఇప్పుడు టిడిపి సైతం జాగ్రత్త పడుతోంది. మున్ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎదురైన పరిస్థితి తలెత్తకుండా.. సొంత క్యాడర్ను అప్రమత్తం చేస్తోంది. అందులో భాగంగానే సోషల్ మీడియాలో అనవసర, అసభ్యకర పోస్టులు పెట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గాల్లో కూడా దూకుడు, వివాదాలకు దూరంగా ఉండాలని నేతలకు సూచిస్తుంది. అయితే వైసీపీ శ్రేణులు దీనిని భయం అంటుండగా.. సంయమనం అని టిడిపి చెబుతోంది. ఎవరికి వారిగా వాటిని అన్వయించుకుంటున్నారు.
నారుపల్లి శివదస్తగిరి రెడ్డి (MD)
8686186039