Tv424x7
Andhrapradesh

హైజాక్‌కు గురైన నౌకలోకి భారత నేవీ కమాండోలు..!

హిందూ మహా సముద్రంలో లైబీరియా జెండా కలిగి ఉన్న ఓ నౌక (MV LILA NORFOLK) గురువారం సాయంత్రం హైజాక్‌కు గురైంది. ఈ విషయం తెలుసుకున్న భారత నావికాదళం ఐఎన్‌ఎస్‌ చెన్నై యుద్ధ నౌకను రంగంలోకి దింపింది..హెలికాప్టర్‌ ద్వారా హైజాకర్లకు హెచ్చరికలు జారీ చేశామని అధికారులు తెలిపారు. బందీలను విడిపించేందుకు నేవీ కమాండోలు హైజాక్‌కు గురైన నౌకలోకి ప్రవేశించి, కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గురువారం సాయంత్రం గుర్తుతెలియని సాయుధులు నౌకలోకి అక్రమంగా ప్రవేశించారని యూకే మారిటైమ్‌ ఏజెన్సీకి సందేశం పంపడంతో ఈ హైజాక్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నౌకలోని 15 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది..

Related posts

వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో దుర్గమ్మ తల్లి పూజా కార్యక్రమం

TV4-24X7 News

పేదలకు శుభవార్త: ఇంటి అనుమతులు కేవలం రూ.1!

TV4-24X7 News

పెనుయేల్ గాస్పల్ బాప్టిస్ట్ చర్చి క్రిస్మస్ వేడుకలు లో పాల్గొన్న విల్లూరి

TV4-24X7 News

Leave a Comment