👉 మంగళవారం మధ్యాహ్నం తమిళనాడు కోయంబత్తూర్ సేషన్స్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది.👉 2016 నుంచి 2018 మధ్యలో తమిళనాడు పొల్లాల్చి లో కళాశాల కు చెందిన విద్యార్థిని కొంతమంది ఆత్యాచారం చేసి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ ద్వారా లక్షలు వసూలు చేశారు. అదేవిధంగా మరికొంతమంది మహిళలు ను కూడ ఈ గ్యాంగ్ లై0గీక వేధింపులు చేసి డబ్బులు వసూలు చేశారు. దీనితో 2019 లో ఒక బాధిత విద్యార్థిని పోలీసులకు పిర్యాదు చేసింది.
👉 ఈ విషయం పై తమిళనాడు లో పెద్ద దుమారం రేపింది. దీనితో ప్రభుత్వం ఈ కేసును సిబి సీఐడీ కు అప్పగించింది.
👉 ఈ కేసులో 9 మందినీ అరెస్టు చేసి జైలుకు పంపారు. తరువాత ఈ కేసును సీబీఐ కి అప్పగించారు.సీబీఐ అధికారులు ఈ కేసులో 200 కీలక పత్రాలు తొ పాటు 400 ఎలక్రిటిక్ పరికరాలను కోర్టు కు సమర్పించారు.
👉2019 నుంచి ఈ కేసులో 9 మంది పొలాల్చి జైలు లో ఉన్నారు.👉 ఈ రోజు మధ్యాహ్నం ఈ కేసు తుది తీర్పును కోయంబత్తూర్ కోర్టు 9 మందికి జీవిత కాలం శిక్ష ను విధిస్తూ తీర్పు చెప్పింది.
👉 దీనితో బాదితులు సంతోషం వ్యక్తం చేశారు.