Tv424x7
Andhrapradesh

రేపు దువ్వూరు లో సుమారు 300 బైకులతో ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా బైక్ తిరంగ్ ర్యాలీ

కడప /మైదుకూరు :మండల కేంద్రమైన దువ్వూరులో హనుమాన్ జయంతి పురస్కరించుకున రేపు గురువారం మూడు వందలు బైకులతో తిరంగ్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అరవేటి హరికృష్ణ,, అమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు పేర్కొన్నారు.బుధవారం వారు మాట్లాడుతూ దువ్వూరులో భారత ప్రభుత్వం ఉగ్రవాదులను ఏరిపారివేయడమే లక్ష్యంగా పాకిస్తాన్ దేశం మీద చెప్పట్టిన మహోన్నత కార్యక్రమం ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం, ప్రధాని నరేంద్ర మోడీజీ సమర్థవంతగా త్రివిధ దళాల సమన్వయ ముతో విజయవంతంగా పూర్తి చేయడంతో ఇందుకు మద్దతుగా, సంఘీభావంగా దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు, వేడుకలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మండల కేంద్రమైన దువ్వూరు లో ఆరవేటి హరికృష్ణ, అమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరుల సమన్వయ ముతో సుమారు 300 వందల బైకులతో భారీ ర్యాలీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు కరపత్రాల ద్వారా పార్టీలకు, వర్గాలకు, మతాలకు అతీతంగా అందరిని కలుపుకొని ఈ తిరంగ్ ర్యాలీ కార్యక్రమం జరుగుతుందన్నారు

Related posts

తిరుమలకు ఎన్డీబీ ల్యాబ్ పరికరాలు

TV4-24X7 News

4వేల లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం

TV4-24X7 News

సీతoరాజు సుధాకర్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన విల్లూరి భాస్కర్ రావు మరియు బొత్స రాము కార్యకర్తలు

TV4-24X7 News

Leave a Comment