Tv424x7
Andhrapradesh

కాల్‌ సెంటర్‌ ముసుగులో సైబర్ నేరాలు- నెలకు రూ.15 కోట్ల నుంచి రూ.20కోట్లు

అచ్యుతాపురం కేంద్రంగా రెండేళ్ల నుంచి కాల్‌ సెంటర్‌ నిర్వహణ- అమెరికా సహా ఇతర దేశాల ప్రజలే లక్ష్యంగా మోసాలురాష్ట్రవ్యాప్తంగా సైబర్‌ నేరగాళ్లు చెలరేగి పోతున్నారు. వివిధ రకాలుగా మోసగించి రూ.కోట్లు దోచేస్తున్నారు. కష్టపడి పని చెయ్యకుండా ప్రజలను మోసం చేసి జల్సాగా జీవితాన్ని గడుపుతున్నాపు కొందరు సైబర్ నేరగాళ్లు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కాల్‌సెంటర్‌ ద్వారా అమెరికా వాసులను లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరాలకు పాల్పడిన ముఠాను అరెస్టు చేసినట్టు ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు అచ్యుతాపురం కేంద్రంగా రెండేళ్ల నుంచి కాల్‌ సెంటర్‌ నిర్వహిస్తూ అమెరికా సహా ఇతర దేశాల ప్రజలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో తేలిందన్నారు. నెలకు రూ.15 కోట్ల నుంచి రూ.20కోట్ల వరకు సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.అచ్యుతాపురం కాల్‌సెంటర్‌లో 200 నుంచి 250 మంది వరకు పని చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. కాల్‌సెంటర్ల ముసుగులో సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న 33 మందిని అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి రూ.3లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కాల్‌ సెంటర్‌కు సంబంధించి దేశ వ్యాప్తంగా ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో పాటు సీఐడీ అధికారుల సాయంతో ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తుహిన్‌ సిన్హా వెల్లడించారు

Related posts

దసరా ఉత్సవాలు రాట ముహర్తం కార్యక్రమం లో పాల్గొన్న విల్లూరి

TV4-24X7 News

16నుంచి వైఎస్ఆర్ చేయూత నిధులు

TV4-24X7 News

356 రోజులు దిగ్విజయంగా పూర్తయిన 10 రూపాయల భోజనాలు పంపిణీ

TV4-24X7 News

Leave a Comment