వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై టీడీపీ నాయకుడు, మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. “జగన్ గా రూ.. మీరు కడుపు మంటతో అల్లాడుతున్నారు. నాకు తెలుస్తోంది. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తా. నీళ్లలో కలుపుకొని తాగండి. కడుపు మంట తగ్గుతుంది.” అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కీలకమైన సూపర్ 6 హామీల్లో ఒకటైన తల్లికి వందనంపథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పథకంలో లోపాలు ఉన్నాయంటూ.. జగన్‌కు చెందిన మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఈ ప్రసారాలపై మంత్రి నారా లోకేష్ తనదైన రీతిలో స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తల్లికి వందనం పథకం అమలు తీరు జగన్ కడుపు మంటను మూడింతలు పెరిగేలా చేసిందన్నారు. అందుకే తన విష పత్రికలో నకిలీప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లులందరికీ నిధులు అందాయని.. ఈవిషయం తెలిసి కూడా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. దొంగలెక్కలు సృష్టించడం.. పేదల పేరుతో సొమ్ము కొట్టేయడం జగన్ బ్రాండ్ అని వ్యాఖ్యానించారు.“ఇది ప్రజా ప్రభుత్వం. జగన్ ఈ విషయం మరిచిపోయినట్టుగా ఉన్నాడు. తన ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు కూడా ఉంటుందని ఆయన అనుకుని ఉంటాడు. ప్రజా ప్రభుత్వంలో తప్పులు చేయం, ఎవరినీ చేయనివ్వం. తల్లికి వందనం సక్సెస్ కావడంతో జగన్‌కుకడుపు మంట పెరిగిందని అందుకే.. ఇలా తన మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కడుపు మంట తగ్గించుకునేందుకు నేనే స్వయం 2 ఈనో ప్యాకెట్లను పంపిస్తా.. నీళ్లలో కలుపుకొని తాగండి.. కడుపు మంట కొంతైనా తగ్గుతుంది” అని నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

previous post
next post