విమానయాన రంగ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ విమానం గాల్లోకి ఎగిరింది. ఇందులో భాగంగానే నలుగురు ప్రయాణికులతో విజయవంతంగా ప్రయాణం చేసింది. ఈ ఎలక్ట్రిక్ విమానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. చాలా తక్కువ ధరకే ప్రయాణికులకు సేవలు అందించనుంది. ఇందులో మరో విశేషం ఏంటంటే కొంత దూరాన్ని ప్రయాణించేందుకు హెలికాప్టర్‌కు అయ్యే ఇంధనం ఖర్చు కంటే తక్కువలోనే ఈ ఎలక్ట్రిక్ విమానం ప్రయాణించింది.విమానంలో ప్రయాణించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆ టికెట్ ధరలు చూస్తేనే కళ్లు గిర్రున తిరిగిపోతాయి. విమానం ఎక్కడం అనేది సామాన్యులకు ఎప్పటికీ ఒక కల. ఎప్పటికైనా విమానం ఎక్కాలనే కోరికతో చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడప్పుడూ ఎయిర్‌లైన్ సంస్థలు ఆఫర్లు ప్రకటించి.. తక్కువ ధరకే విమాన టికెట్ అందిస్తే.. కొందరు కొనుగోలు చేసి.. విమానం ఎక్కి ఆకాశంలో విహరిస్తూ ఉంటారు. కానీ చాలా మంది మాత్రం తాము కూడా విమాన ప్రయాణం చేయాలనే వేచి చూస్తారు. ఇక విమాన టికెట్ల ధరలు అంత ఎక్కువగా ఉండటానికి కారణం.. దాని ఇంధనం, మెయింటెనెన్స్‌కు భారీగా ఖర్చు కావడమే. ఇక ప్రస్తుతం వాహనాల రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. స్కూటీ, బైక్ దగ్గరి నుంచి.. ట్రక్కులు, బస్సులు, రైళ్ల వరకు అన్ని వాహనాలు రోజురోజుకూ ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ విమానం అందుబాటులోకి వచ్చి.. ఎయిర్‌లైన్ చరిత్రలోనే సరికొత్త ట్రెండ్‌కు తెరలేపింది.

previous post
next post