ఏపీ: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ కీలక నేతలకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19న రైతుల పరామర్శ కోసం జగన్ యార్డుకు వెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా మిర్చి యార్డుకు ఆయన వెళ్లారని పోలీసులు కేసు నమోదు చేశారు.
