అతడు సినిమాలో బ్రహ్మాజీ .. మహేష్ బాబుకు స్పాట్ పెట్టడానికి సుమోలు పెట్టాలని ప్లాన్ చేస్తాడు. మహేష్ బాబు వెళ్లే ప్రతి సందులోనూ సుమోలు పెడతానంటాడు. ఓ చోట మిస్ అయితే మరో చోట దొరుకుతాడని ప్లాన్. అయన ప్లాన్ విని అన్నిసుమోలెందుకులా బుజ్జా అంటాడు తనికెళ్లభరణి.. జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు ఏడాది పాలనపై అలాంటి ప్లాన్ తోనే వచ్చారు.పార్టీ ముఖ్య నేతల సమావేశం అని పిలిచి అందరికీ తన ప్లాన్ చెప్పారు. చంద్రబాబు పాలన ఏడాది గడిచింది.. హనీమూన్ పిరియడ్ అయిపోయింది. ఇక ఆయన గురించి జనాల్లోకి వెళ్లి చెప్పాలని ఉపదేశించారు. ఏం చెప్పాలో కూడా ఆయన చెప్పారు. అందు కోసం క్యూ ఆర్ కోడ్‌లు రెడీ చేశారు. జిల్లా, నియోజకవర్గం, గ్రామ స్థాయిలో క్యూ ఆర్ కోడ్‌లు ఉంటాయని వాటన్నింటినీ స్కాన్ చేసి ప్రజలకు నిజాలు చెప్పాలని ఆయన దిశానిర్దేశం చేశారు.చంద్రబాబు పాలనలో ఏడాదికి ఇంత వస్తాయని బాండ్లు ఇచ్చారని ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని జగన్ అనుకుంటున్నారు. అందుకే ఇంటింటికి ఐదు వారాల పాటు వెళ్లాలని సూచించారు. అసలు క్యాడర్ బయటకు రాకపోతున్న సమయంలో ఇలా రోజూ ఇంటికి పోవాలని ఐదు వారాల పాటు కార్యక్రమం పెట్టడంతో అందరూ అబ్బో ఇక జరిగినట్లే అనుకున్నారు. జగన్ రెడ్డి రోడ్డు మీదకు వచ్చి ఏమైనా చేస్తారనుకుంటే.. అందరికీ పనులు చెప్పి ఆయన వారంలో నాలుగు రోజులు యలహంకలో రెస్టు తీసుకోవడంతో ఇక జరిగే పనేనా అని సెటైర్లు వేసుకున్నారు.ఏడాది కాలంలో ప్రతిపక్ష పార్టీపైనే వ్యతిరేకత పెంచుకునేలా జగన్ తీరు ఉంది. ముఖ్యనేతల కార్యక్రమానికీ చాలా మంది హాజరు కాలేదు. వచ్చిన వారికే తన క్యూ ఆర్ కోడ్ కథ చెప్పి పంపించారు. మొత్తంగా ఐ ప్యాక్ ను వదిలించుకోలేదని.. ఇలాంటి పిచ్చి పిచ్చి పోరాటాలు వాళ్లే ప్లాన్ చేస్తారని పార్టీ నేతలు అసంతృప్తికి గురవుతున్నారు.

previous post