బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా, యానాంలలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అటు తెలంగాణ లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో సాధారణ వర్షాలు కురుస్తాయంది.

previous post