Tv424x7
Andhrapradesh

సుప్రీంకు చేరిన కల్తీ నెయ్యిపై సిట్ రిపోర్టు – వాట్ నెక్ట్స్ ?

తిరుమల శ్రీవారి ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి కల్తీపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ తమ ప్రాథమిక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. రెండు రోజుల కిందట సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణలో కీలక ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది.సుప్రీంకోర్టు సిట్ నియమించిన తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పాత్రధారులను గుర్తించారు. అరెస్టు చేశారు. వారుసరఫరా చేసింది అసలు నెయ్యే కాదని. కెమికల్స్ తో తయారు చేసిన పామాయిల్ లాంటి పదార్థమని గుర్తించారు. నిందితుల రిమాండ్ రిపోర్టులో కొన్ని విషయాలను పొందు పరిచారు. అసలు చాలా విషయాలను సుప్రీంకోర్టుకు ఇచ్చిన రిపోర్టులో వెల్లడించి ఉంటారని భావిస్తున్నారు.సూత్రధారులు తెర వెనుక ఉండి పాత్రధారులతో ఆడిస్తున్న నాటకాలు, కోర్టుల్లో వేస్తున్న పిటిషన్ల అంశంపైనా సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల తనకు ఓ పోలీసు అధికారి నోటీసులు జారీ చేశారని ఆయన సిట్ లో భాగం కాదని వైవీ సుబ్బారెడ్డి కోర్టుకెళ్లారు. కోర్టు కూడా వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చిన నోటీసుల్ని అదే కారణంతో రద్దు చేసింది. ఇలా దర్యాప్తును ఆటంకం కలిగించేలా వ్యవహరించడంతో పాటు.. పలు రకాల పిటిషన్లు వేయడం.. ఇప్పటికే అరెస్టు చేసిన వారిని బెదిరించడం, నిందితులుగా ఉన్న వారితో కుట్రలు చేయడం వంటివి చేస్తున్నారని సిట్ గుర్తించింది.కల్తీ నెయ్యి చాలా పెద్ద మాఫియా అని .. సిట్ గుర్తించినట్లుగా చెబుతున్నారు. అందుకే సుప్రీంకోర్టుకు సమర్పించే నివేదిక అతి పెద్ద సంచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Related posts

ఏపీలో నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్స్

TV4-24X7 News

గుండెపోటుతో మాజీ MLC కన్నుమూత

TV4-24X7 News

డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్‌కుమార్‌తో జగన్

TV4-24X7 News

Leave a Comment