Tv424x7
Andhrapradesh

లాడ్జిలో వ్యభిచారం.. ఇద్దరు అరెస్ట్

నాయుడుపేట పట్టణంలో శ్రీకాళహస్తి హైవే వద్దశివ సాయి లాడ్జిలో వ్యభిచారం బయటపడింది. వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నాయుడుపేట పట్టణంలోని శ్రీకాళహస్తి హైవే వద్ద శివ సాయి లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందని సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందని సమాచారం మేరకు దాడి చేయడం జరిగిందని ఈ దాడుల్లోయువతితోపాటు లాడ్జి ఓనర్ అయిన జయ రామయ్య నాయుడుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాయుడుపేట అర్బన్ సీఐ బాబి తెలియజేశారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు : సీఐ బాబి

లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నాయుడుపేట అర్బన్ సీఐ బాబి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు తావిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. నాయుడుపేట పట్టణంలోని లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వ్యభిచారం, పేకాట, మద్యం ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని నాయుడుపేట అర్బన్ సీఐ బాబి హెచ్చరించారు.లాడ్జీల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. బస చేసేందుకు వచ్చే వారి పూర్తి వివరాలతో పాటు గుర్తింపు కార్డు జిరాక్సులు తీసుకోవాలన్నారు. మద్యం, జూదం, వ్యభిచారం నిషేధమని ఎవరైనా లాడ్జీల్లో వీటిని ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన సూచించారు. అనుమానించదగిన వ్యక్తులు వస్తే వెంటనే పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను చట్టానికి పట్టించి శాంతి భద్రతల పరిరక్షణలో తోడ్పాటునందించాలని ఆయన అన్నారు.

Related posts

టీచర్ టూ… హోమ్ మినిస్టర్..!

TV4-24X7 News

ప్రభుత్వ నర్సులతోనే కేజీహెచ్ కు గౌరవం

TV4-24X7 News

వివేకానంద సంస్థలో అన్నదానం, వస్త్ర దానం

TV4-24X7 News

Leave a Comment