Tv424x7
Telangana

ఈటల రాజేందర్‌కు దారేది ?

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈటల రాజేందర్‌కు షాక్ తగిలింది. ఇక ప్రకటనే తరువాయి అని ఆయన ఊహాల్లో ఉన్నారు. కానీ పదవి చేజారిపోయింది. పెద్దగా రేసులో వినిపించని పేరు రామచంద్రరావుకు అవకాశం దక్కింది. ఇప్పుడు ఈటల రాజేందర్ పరిస్థితి ఎటూ కాకుండా అయిపోయినట్లయింది. ఆయను గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం అభ్యర్థిగా ప్రధాని మోదీ పరోక్షంగా ప్రచారం చేశారు. బీసీ సీఎం నినాదంతో ఆయననే ముందు పెట్టారు. కానీ ఫలితాలు రాలేదు.మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో చాన్స్ వస్తుందనుకున్నారు. కానీ బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు చాన్స్ రావడంతో ఈటలకు బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారని అనుకున్నారు. కానీ రాను ఆయనకు వ్యతరేకంగా బలమైన వర్గం హైకమాండ్ వద్ద ప్రచారం చేయడం ప్రారంభించంది. చివరికి అది .. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ఇవ్వడం కన్నా… ఎప్పటి నుంచే పార్టీలో ఉన్న వారికి ఇవ్వడం బెటరని .. హైకమాండ్ ఫిక్సయింది.ఈటల రాజేందర్ .. మొదటగా బీజేపీలో చేరకుండా కాంగ్రెస్ లో చేరినట్లయితే ఆయన ఈ పాటికి కేబినెట్ లో ఉండేవారు. రేవంత్ తో మంచి సంబంధాలు కూడా అప్పట్లో ఉండేవి. ఇప్పుడు ఆయన బీజేపీలో మరో నాలుగేళ్లు ఎంపీగా గడపాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ కు మద్దతుగా మాట్లాడుతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పరిస్థితి మళ్లీ మెరుగుపడితే.. అధికారంలోకి వస్తుందనుకుంటే.. ఈటల రాజేందర్ మళ్లీ ఆ వైపు చూసే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Related posts

కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు

TV4-24X7 News

చోరీ కేసును 24గంటల్లో ఛేదించిన పోలీసులుచోరీ

TV4-24X7 News

రాజకీయ కుట్రలకు అధికారులు బలి

TV4-24X7 News

Leave a Comment