ఏపీ: రాష్ట్రవ్యాప్తంగా రేపు ప్రైవేట్ స్కూల్స్ బంద్ కానున్నాయి. కొందరు అధికారులు తనిఖీలు, నోటీసుల పేరిట వేధింపులకు గురి చేస్తున్న నేపథ్యంలో గురువారం అన్ని ప్రైవేటు స్కూళ్లు బంద్ చేసి, నిరసన తెలపనున్నట్లు యాజమాన్యాల అసోసియేషన్ ప్రకటించింది. క్లియర్ గా పరిశీలించకుండా ఎలాంటి చర్యలకు ఉపక్రమించొద్దని కోరింది. రాష్ట్రంపై ఆర్థిక భారం లేకుండా 55% కంటే ఎక్కువ మంది విద్యార్థులకు సేవలందిస్తున్నట్లు వెల్లడించింది.*
