Tv424x7
Andhrapradesh

అంబేడ్కర్ గురుకులం ను పట్టించుకోని డీసీఓ:-ఎఐవైయఫ్

ఏళ్ళ తరబడి అక్కడే పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయకపోవడం వెనుక ఆంతర్యమేమి???

కడప బద్వేలు పట్టణం లోని మడకలవారిపల్లే అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం లేదు అలాగే సరైన మంచినీరు ఇవ్వడం లేదు సరైన మౌలిక సదుపాయాలు లేవని పరిశీలనకు వెళ్లి మినరల్ వాటర్ మిషన్ గత సంవత్సరం చివర్లో కొత్తది తెచ్చారు.దాదాపు 6 నెలల పైబడి ఆరుబయట సిమెంట్ రోడ్డు మీద ఉంది. అని డీసీఓ గారికి చెబితే ఇంతవరకు కనీసం పాఠశాలను సందర్శించకపోవడం బాధాకరం అని అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు పెద్దుళ్ళపల్లి ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ……… భోజనం సరిగా లేదు. మినరల్ వాటర్ లేవు. మౌలిక సదుపాయాలు లేవు. మినరల్ వాటర్ కేవలం ఉపాద్యాయులు మాత్రమే వాడుతున్నారు.విద్యార్థులకు ఇవ్వడం లేదు.దానిపైన కూడా ఇంతవరకు పరిశీలన లేకపోవడం దుర్మార్గం.గత సంవత్సరం పనిచేసిన ప్రిన్సిపాల్ ఫర్నీచర్ అమ్ముకున్నది అని ఆరోపణ వస్తే దానిపైన విచారణ లేదు. నాడు నేడు పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపణ వస్తె దానిపైన విచారణ లేదు. బాలికల గురుకుల పాఠశాల అవరణ లోపలికి మగవాళ్ళకు పర్మిషన్ లేదు అని గత సంవత్సరం ఉన్న ఒకరో ఇద్దరో ఉపాధ్యాయులను బదిలీ చేశారు. అదే పాఠశాలలో ఏళ్ల తరబడి పని చేస్తున్న రమణ,గురివిరెడ్డి,సుమంత్ లు ఏవిధంగా చేస్తున్నారు.వీళ్ళకి వర్తించవా అని ఆయన అన్నారు.ఈ మధ్యకాలంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు జరిగాయి. అయినా వీళ్లకు ఇద్దరికీ బదిలీలు లేకపోవడం వెనుక ఆంతర్యమేమిటి అని ఆయన ప్రశ్నించారు. మొత్తంగా బద్వేలు గురుకుల పాఠశాల లో ఏ సమస్య వచ్చినా జిల్లా అధికారులు స్పందించి, చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటనీ,ఇక్కడనుండి అధిక మొత్తంలో కమిషన్లు ముట్టడం వల్లనే జిల్లా అధికారులు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారనీ,జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది తమదైన శైలిలో విద్యార్థుల ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన వాపోయారు. విద్యాసంవత్సరం మొదట్లోనే ఇలా ఉంటే ఇక సంవత్సర పొడవునా విద్యార్థులు ఇక్కడ ఉన్న ఉపాద్యాయులు మరియు సిబ్బందితో ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో అని ఆయన విచారం వ్యక్తం చేశారు. కావున జిల్లా కలెక్టర్ గారు విచారణ చేసి వెంటనే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత డీసీఓ మరియు పాఠశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బందిపై చర్యలు తీసుకొని, మూడేళ్లపైబడి అక్కడ పనిచేస్తున్న సిబ్బంది నీ వెంటనే బడిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.లేని పక్షంలో అఖిల భారత యువజన సమాఖ్య కడప జిల్లా సమితి అధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐవైయఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్, బద్వేలు పట్టణ కార్యదర్శి మధు పాల్గొన్నారు

Related posts

గ్రామపంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి…

TV4-24X7 News

తాడిపత్రిలో 144 సెక్షన్.. వేర్వేరు ప్రాంతాలకు జేసీ ప్రభాకర్‌ రెడ్డి పెద్దారెడ్డి తరలింపు

TV4-24X7 News

వైఎస్ జగన్ పథకాలపై బాబు కుట్ర:సజ్జల

TV4-24X7 News

Leave a Comment