అమరావతి :ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 30తో ప్రవేశాలకు గడువు ముగిసింది. కొన్నికళాశాలల అభ్యర్థన మేరకు ప్రవేశాల గడువును పొడిగించారు. పదో తరగతిలో సప్లిమెంటరీ పరీక్షలతో కలిపి మొత్తం 5,92,602మంది ఉత్తీర్ణత సాధించగా ఇప్పటివరకు ఇంటర్మీడియట్లో 4.90లక్షల మంది చేరారు.

previous post
next post