రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్లకు జూన్ 30వ తేదీన సికింద్రాబాద్ కొంపల్లి గౌరిక్ ఫంక్షన్ హాలులో 2024 – 2025 సంవత్సరములు చేసిన సేవా కార్యక్రమాలకు బాపట్లకు 3 అవార్డులు, 7 ప్రశంసాపత్రాలు గవర్నర్ కాట్రగడ్డ శరత్ చౌదరి చేతుల మీదుగా బాపట్ల క్లబ్ కార్యదర్శి వేజండ్ల శ్రీనివాసరావు అందుకున్నట్లు గురువారం రాత్రి రోటరీ క్లబ్ నందు జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన తెలుపుతూ, ఈ అవార్డ్స్ కు రావడానికి రోటరీ సభ్యులు అందరి సమిష్టి కృషి అని, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆయన తెలిపారు.కొత్త కార్యవర్గం ఈనెల 11వ తేదీ ఆదివారం సాయంత్రం రోటరీ మండపం నందు రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్ వి రాంప్రసాద్, అసిస్టెంట్ గవర్నర్ పి రాఘవయ్య గారి చేతుల మీదగా జరుగుతుందని, ఈ సంవత్సర కాలంలో మేము చేసిన సేవా కార్యక్రమంలకు సహకరించి దాతలకు మరియు మా రోటరీ సభ్యులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మాజీ అధ్యక్షుడు ఉపేంద్ర గుప్త తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ రోటరీ సభ్యులు వై నాగేశ్వరరావు, బి రామ సుబ్బారావు, ఎస్ రమేష్ బాబు, జిట్టా శ్రీనివాసరావు, జెవి కృష్ణారావు, కొల్లా శ్రీనివాసరావు, ఎం సుధీర్ కుమార్, కే ఏ వి ప్రసాద్,కొత్త సుబ్బారావు, తటవర్తి సుబ్బారావు, షేక్ మస్తాన్ వలీ, తోట కృష్ణమూర్తి, నల్లమల్లి శ్రీనివాసరావు, దేవక వెంకట సుబ్రహ్మణ్యం, బి శివరామకృష్ణ, కే బాలాజీ, పి వి సత్యనారాయణ, టి మల్లికార్జునరావు, సిహెచ్ వెంకటేశ్వరరావు, జీవి ఆంజనేయులు, ఏ సమర్పణ రావు, పి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

previous post