విజయవాడ: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు.లిక్కర్ స్కామ్ కేసులో A4గా మిథున్ రెడ్డి ఉన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు రేపు కోర్టులో హాజరుపరుస్తారు. ఈ విషయాన్ని సిట్ అధికారులు మిథున్ రెడ్డి కుటుంబసభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. విచారణ నిమిత్తం మిథున్ రెడ్డి విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చిన విషయం తెలిసిందే. విచారణ ముగిసిన అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు.
