గొండ్రియాల గ్రామానికి చెందిన దంపతులకు 2009లో వివాహం…2025 లో వివాహం జరిగినట్టుగా నకిలీ పత్రాలు సృష్టించిన రెవిన్యూ అధికారులు….
కళ్యాణ లక్ష్మి డబ్బులో సగం లబ్ధిదారులకు… సగం అధికారులకు
కళ్యాణ లక్ష్మి పుట్టక ముందు పెళ్లి…పెళ్ళైన 16 ఏళ్లకు కళ్యాణ లక్ష్మి చెక్కు
16 ఏళ్ల కు చెక్కు రావడంతో స్థానికులకు అనుమానం…ఉన్నతాధికారులకు చేరిన అక్రమాల వ్యవహారం….ఎమ్మార్వో కార్యాలయంలో చక్రం తిప్పిన ఓ రెవిన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)…?
అనంతగిరి : ఆడబిడ్డ పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి పథకం కొంతమందికి వరంగా మారింది. గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి పథకం అధికారుల నిర్లక్ష్యానికి పక్కదారి పడుతోంది. అనంతగిరి మండల రెవిన్యూ అధికారుల మాయాజాలంతో మండలం లోని గొండ్రియాల గ్రామానికి చెందిన దంపతులు కళ్యాణ లక్ష్మి పుట్టక ముందు 2009 లో వివాహం చేసుకొని 2025 వివాహం జరిగినట్లు దంపతులకు నకిలీ పత్రాలు సృష్టించిన రెవిన్యూ అధికారులు కళ్యాణ లక్ష్మి డబ్బులలో సగం లబ్ధిదారులకు మరో సగం రెవిన్యూ అధికారులకు వాటా తీసుకున్నట్లు తెలుస్తుంది. పెళ్లి జరిగిన పెళ్లి జరిగిన 16 సంవత్సరాల తరువాత కళ్యాణ చెక్కు రావడం తో స్థానికులకు అనుమానం రావడం తో తెలిసిన సమాచారం తో తీగ లాగడం తో డొంక్క కదులుతుంది. భారీ ఎత్తున ఈ కుంభకోణం జరిగినట్లు తెలుస్తుంది.ఈ అక్రమాలలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ చక్రమం తిప్పినట్లు తెలుస్తుంది.ఈ అక్రమాల కుంభకోణం ఉన్నతధికారుల దృష్టికి చేరింది.ఉన్నతాధికారుల పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మండలం లో పెద్ద డొక్క కదిలే అవకాశం ఉందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా మండల ప్రజలు కోరుతున్నారు… *ఆర్డీవో సూర్యనారాయణ ను వివరణ*ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతుందని, విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు.