ఇంటర్ నెట్, సోషల్ మీడియా వినియోగంపై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని బద్వేలు పి.ఎస్.ఐ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్.పి ఇ.జి అశోక్ కుమార్ అదేశాల మేరకు గురువారం బద్వేలు పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ లో విద్యార్థులకు పి.ఎస్.ఐ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ నెట్ ద్వారా ఎంత మంచి జరుగుతుందో అంతే స్థాయిలో చెడుకు కూడా అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సోషల్ మీడియా వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చదువులు, నైపుణ్యాలు నేర్చుకునే దశలో, సామాజిక మాధ్యమాల వలలో చిక్కుకుంటే భవిష్యత్తు నష్టపోవాల్సి వస్తుందన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
