Tv424x7
Andhrapradesh

తెలుగు తేజం వెలుగు కిరణం దివికేగిన ధ్రువనక్షత్రం డి పైడి బాబులు

విశాఖపట్నం కీర్తిశేషులు డి.పైడి బాబులు ఘన నివాళులు. జంషెడ్ పూర్(జార్ఖండ్). పద్మశాలి సంఘం పూర్వ అధ్యక్షులు, కీర్తిశేషులు దొడ్డి పైడిబాబులు దశదినకర్మ కార్యక్రమం, జమషెడ్ పూర్ విద్యాపతినగర్ లో వారి స్వగృహంలో జరిగింది. పైడి బాబులు టాటా టెల్కో కంపెనీలో సీనియర్ అకౌంట్ ఆఫీసర్ గా 38 సంవత్సరాలు విశేష సేవలు అందించి పదవి విరమణ పొందారు.ఒక తెలుగు తేజం మొట్టమొదటి సారిగా బీహార్ స్టేట్ బ్యాట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సారధ్యం వహించి.క్రీడస్పూర్తినీ, విజయాలను అందించారు.పద్మశాలి కులము అధ్యక్షులు గా అనేక సంవత్సరాలుగా విశేష సేవలుఅందించి, పద్మశాలి సంఘం కులబంధాలను ఏకంచేసి,సామాజిక, సాంప్రదాయ, కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. కులమత అతీతులు గా అందరితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించారు. ప్రస్తుత పద్మశాలి సంఘం అధ్యక్షులు తిప్పాన సాంబశివరావు , జనరల్ సెక్రటరీ శ్రీ చింతలపూడి జయసూర్య ప్రకాష్ ,కోశాధికారి జక్కం శ్రీనివాస్ , సహచర ఆంధ్రా తెలుగు సమితి సభ్యులందరూ, పైడిబాబులు సేవలను,వారు చేసిన కృషి నీ కీర్తిస్తూ, ఘన నివాళులు అర్పించారు.ఈ సంతాప కార్యక్రమానికి ,సమాజసేవకుడు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్, విశాఖపట్నం సిటీ, పెద వాల్తేరు పద్మశాలి కులము, సేనాధిపతి, పంపాన ఆనంద (రాజు), పాల్గొని పైడిబాబులు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఈ సంతాప కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, పెద్దలు రాజేశ్వరి ,కుమారుడు రవిబాబు,కుమార్తెలు ఉషా,శారద, అరుణ, మరియు శ్రేయాభిలాసులు, బంధువులు, స్నేహితులు, స్వర్గీయ పైడి బాబులు కి ఘన నివాళులు అర్పించారు.

Related posts

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసుల మృతి

TV4-24X7 News

ట్రాఫిక్ నిబంధనలపై డ్రైవర్లకు అవగాహన కనిపిస్తున్న సిఐ

TV4-24X7 News

చిన్నసింగన పల్లె సచివాలయం పరిధిలో _ఆంధ్ర ప్రదేశ్ కి జగన్ యే ఎందుకు కావాలంటే

TV4-24X7 News

Leave a Comment