Tv424x7
Andhrapradesh

శ్రీవారికి ఓ అజ్ఞాత వ్యాపారవేత్త భారీ కానుక ఎక్స్​లో తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు ఏంటో తెలుసా…?

తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి 121 కిలోల బంగారాన్ని విరాళంగా ఇవ్వడానికి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ముందుకొచ్చారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇలాంటి భారీ విరాళాలు తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టే వైద్యం. విద్య వంటి సేవలు ఇలా ఎన్నో సత్కార్యాలకు దోహదం చేస్తాయని తెలిపారు. పీ4 కార్యక్రమానికి వస్తున్న స్పందన వల్ల తనకు ఎంతో సంతృప్తినిస్తోందని ‘ఎక్స్​’ వేదికగా వెల్లడించారు.‘పరోపకారం పరమ ధర్మమని భారతీయ సంస్కృతి చెబుతోంది. సమాజానికి సేవ చేయడం మన ధర్మం. అందుకే మనది పుణ్యభూమి. నలుగురూ బాగుండాలనే నాడు ‘జన్మభూమి’ కార్యక్రమం చేపట్టి మార్పునకు శ్రీకారం చుట్టాను. డబ్బు సంపాదించడం కంటే, దాన్ని తిరిగి సమాజానికి ఖర్చు చేయడమే ఎక్కువ తృప్తి, నిజమైన సంతోషాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇదో గొప్ప ఆదర్శంగా నిలిచి ఎన్నో మార్పులకు నాంది పలకాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.ఇటీవల తిరుమల శ్రీవారి భక్తుడు ఓ కంపెనీ స్థాపించి విజయవంతమయ్యారు. దానిలో 60 శాతం వాటా అమ్మితే ఆయనకు సుమారు రూ.6-7 వేల కోట్ల డబ్బు వచ్చింది. ఈ సంపద అంతా స్వామివారు ఇచ్చిందేనన్న ఆలోచనతో తిరుమలేశుడికి 121 కిలోల బంగారం ఇచ్చేందుకు ముందుకొచ్చారు’ అని సీఎం వెల్లడించారు. శ్రీవారు నిత్యం 120 కిలోల ఆభరణాలు ధరిస్తారు. ఈ భక్తుడు కూడా సుమారు అంతే స్వర్ణాన్ని కానుకగా సమర్పించారు. దీని విలువ రూ.140 కోట్ల పైనేనని అంచనా వేస్తున్నారు.

రికార్డు స్థాయిలో అమ్ముడైన లడ్డూలు :ఈ ఏడాది తిరుమలలో జులై 12న రికార్డు స్థాయిలో 4,86,134 లడ్డూలు అమ్ముడుపోయాయి. గత సంవత్సరం ఇదే రోజు 3.24 లక్షలు విక్రయించగా అది 35 శాతం వరకు పెరగడం విశేషం. దీంతో ఆ ఒక్కరోజులోనే లడ్డూల విక్రయం ద్వారా రూ.2.43 కోట్లు సమకూరింది. గత ఏడాది జులై నెలలో లడ్డూల ఉత్పత్తి (చిన్నవి 160-180 గ్రాములు) 1,04,57,550 ఉండగా ఈ ఏడాది జులైలో 1,25,10,300కు పెరిగింది. జులై నెలలో 1,04,03,719 లడ్డూలు అమ్ముడుపోగా ఈ ఏడాది జులైలో 1,24,40,082 అమ్ముడుపోయాయి. దీంతోపాటు భక్తుల రద్దీ పెరిగినప్పుడు సరిపడా అవసరాల కోసం బఫర్‌ స్టాక్‌ కింద 4 లక్షలు పెట్టుకున్నారు…

Related posts

నీలాపు సర్వేశ్వర్ రెడ్డిని పరామర్శించిన వాసుపల్లి

TV4-24X7 News

దళిత విద్యార్థి జేమ్స్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

TV4-24X7 News

💥సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేక్*

TV4-24X7 News

Leave a Comment