Tv424x7
Andhrapradesh

మంత్రి లోకేష్ చొరవతో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్

అమరావతి: వినాయక చవితి పండుగను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వినాయక చవితి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పందిళ్ళకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు నిర్వాహకులు మంత్రి నారా లోకేష్ ను కోరారు. దీనిపై స్పందించిన లోకేష్… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15వేల గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. గణేష్ ఉత్సవ పందిళ్ళకు ఉచిత విద్యుత్ అందించడానికి రూ.25 కోట్లు ప్రభుత్వం భరించాల్సి ఉంది. రాష్ట్రంలోని కోట్లాది గణేష్ భక్తుల సౌలభ్యం దృష్ట్యా ఉచిత విద్యుత్ అందించేలా చూడాలని మంత్రి లోకేష్ చేసిన వినతిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ప్రత్యేకంగా జీ.ఓ విడుదలకు ఆదేశాలు జారీచేశారు. అలాగే రాబోయే విజయదశమి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసి దుర్గా దేవి మండపాలకికూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Related posts

హెూంమంత్రి ఆదేశాలతో రంగంలోకి విశాఖ పోలీసులు

TV4-24X7 News

తోక తిప్పితే తాటా తీస్తా.. సీఎం చంద్రబాబు వార్నింగ్

TV4-24X7 News

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌

TV4-24X7 News

Leave a Comment