గుంటూరు :
సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్‌లో పరిచయమై ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.
గుంటూరు జిల్లా నంబూరు గ్రామానికి చెందిన బండ్ల దీపిక వివరాల ప్రకారం – పల్నాడు జిల్లా నరసరావుపేట రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోలం సాయి వెంకటేశ్వర్ రెడ్డి.
ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయమై, తనను నమ్మించి ఐదు నెలల పాటు ప్రేమ చేసి పెళ్లి చేసుకున్నాడు.
ఈ క్రమంలో తాను గర్భవతిగా మారి ప్రస్తుతం తొమ్మిది నెలల బాబు ఉన్నాడని తెలిపింది.అయితే వివాహం తర్వాత తనపై అనవసర ఆరోపణలు చేస్తూ, “నువ్వు వాడితో తిరిగావు, వీడితో తిరిగావు” అంటూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని, తనను వదిలేయాలని చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.“నేను ఎస్సీ కులానికి చెందిన అమ్మాయిని అని తెలిసినా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నన్ను, నా బిడ్డను వదిలేయాలని చూస్తున్నాడు” అని దీపిక తెలిపింది.
ఈ విషయమై ఆమె ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
అనూష