Tv424x7
National

సిక్కింలో హిమపాతం.. 1,217 మందిని రక్షించిన ఆర్మీ

గాంగ్‌టక్‌: ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు (Temparature) అంతకంతకూ తగ్గుతున్నాయి. మంచు భారీగా కురుస్తుండటంతో దిల్లీ (Delhi)తోపాటు ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, సిక్కిం (sikkim) తదితర రాష్ట్రాలను చలి వణికిస్తోంది..మరోవైపు పెద్ద ఎత్తున మంచు కురవడంతో తూర్పు సిక్కింలోని పర్వత సానువుల్లో చిక్కుకుపోయిన 1,217 మంది పర్యాటకులను ఇండియన్‌ ఆర్మీ (Indian Army) రక్షించింది. భారత సైన్యంలోని త్రిశక్తి దళాలు బుధవారం సాయంత్రం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఈమేరకు ఆర్మీ ఉన్నతాధికారులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. వాళ్ల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. చిక్కుకున్నవారిలో చాలా మంది మహిళలు, చిన్నారులు, వయోవృద్ధులు కూడా ఉన్నట్లు తెలిపారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేక చాలా మంది స్పృహ కోల్పోయారని తెలుసుకున్న వెంటనే అప్రమత్తమై త్రిశక్తి దళాలు ఆపరేషన్‌ చేపట్టినట్లు ఆర్మీ వెల్లడించింది..

Related posts

ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

TV4-24X7 News

లోన్‌ ఇస్తానని నమ్మించి రూ.39 వేల నాటు కోళ్లు తినేసిన SBI బ్యాంకు మేనేజర్.. ఎక్కడంటే..?

TV4-24X7 News

కూలిన విమానంలో బ్రిటన్ జాతీయులు… దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్…

TV4-24X7 News

Leave a Comment