ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తర ప్రదేశ్రా ష్ట్రంలో ఓ 15 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. ప్రేమ పేరుతో నమ్మించిన యువకుడు, తన స్నేహితుడితో కూడా శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేయడంతో బాలిక నిరాకరించగా, ఇద్దరూ కలిసి ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ దారుణ ఘటన మిరజాపుర్ లోని పడ్రి ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతురాలు శనివారం రాత్రి తన వదినతో కలిసి ఇంట్లో నిద్రిస్తోంది. అర్ధరాత్రి సమయంలో ఆమె కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై రాత్రంతా వెతికారు. అయితే ఎలాంటి సమాచారం లభించలేదు.ఆదివారం ఉదయం ఇంటికి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న ఓ పొడి కాలువలో బాలిక మృతదేహం కనిపించింది. శరీరంపై ముక్కు, పెదవులు, మెడ భాగాల్లో తీవ్ర గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుఖనై గ్రామానికి చెందిన సాజన్ అనే యువకుడు బాలికతో ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఘటన జరిగిన రాత్రి అతడే బాలికను ఇంటి బయటకు పిలిపించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఆ తర్వాత తన స్నేహితుడు అజయ్‌తో కూడా శారీరక సంబంధం పెట్టుకోవాలని బాలికపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు విచారణలో బయటపడింది. దీనికి బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో కోపానికి గురైన ఇద్దరు నిందితులు ఆమెను కొట్టి, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు సాజన్‌ను పోలీసులు అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను అజయ్ పేరును వెల్లడించగా, అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై అజయ్ కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో జరిగిన ఎదురుకాల్పుల్లో అజయ్ కాలికి బుల్లెట్ తగలగా, ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.కుటుంబంలో నలుగురు పిల్లల్లో మృతురాలే చిన్నదని తెలుస్తోంది. ఆమె తండ్రి ఓ ఆర్కెస్ట్రా నిర్వాహకుడు కాగా, ఘటన జరిగిన సమయంలో మరో గ్రామంలో కార్యక్రమానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుమార్తె మృతదేహాన్ని చూసిన తల్లి స్పృహ తప్పి పడిపోవడం స్థానికులను కలచివేసింది.ఈ ఘటనపై పోలీసులు అత్యాచారం, హత్య తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
previous post

