కడప / ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్‌లో రుణాల మంజూరులో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, బ్యాంక్ సీఈఓ నిరంజన్ రెడ్డి వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని అడ్వకేట్ పద్మనాభరెడ్డి నల్లగారి (పద్దు) డిమాండ్ చేశారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం, తక్కువ విలువ కలిగిన ఆస్తులను అధిక విలువగా చూపించి భారీ రుణాలు మంజూరు చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఉదాహరణకు ₹10 లక్షల విలువ ఉన్న ఆస్తిని ₹1 కోటి విలువగా చూపించి, దానిపై ₹50 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తే, రుణం తిరిగి చెల్లించకపోతే బ్యాంకుకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.టౌన్ బ్యాంకుల్లో సామాన్య ప్రజల కష్టార్జిత డిపాజిట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పొదుపు ఖాతాల రూపంలో ఉంటాయని, ఇలాంటి ఆరోపణలు నిజమైతే సామాన్య ప్రజలే ఎక్కువగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఆడిటింగ్ వ్యవస్థపై కూడా ప్రశ్నలు లేవనెత్తిన ఆయన, “పత్రాల పరంగా అన్ని సక్రమంగా ఉన్నట్టు కనిపించడం వల్లే ఆడిటింగ్‌లో లోపాలు బయటపడకపోవచ్చు. క్షేత్రస్థాయిలో ఆస్తుల వాస్తవ విలువను పరిశీలించకపోవడం కూడా ఒక కారణం కావొచ్చు” అని పేర్కొన్నారు.అలాగే, బ్యాంకులో వివిధ వర్గాల ప్రజలతో పాటు దేవాలయ నిధులు కూడా డిపాజిట్ అయి ఉన్నాయనే నేపథ్యంలో, ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు సీఈఓ వెంటనే పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అవసరమైతే ప్రజా ప్రయోజనాల కోసం నిరాహార దీక్షకు కూడా సిద్ధమని ఆయన వెల్లడించారు.
previous post

