విశాఖపట్నం జిల్లాలోని భీమిలి మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నాగమణి అనే మహిళ తన భర్త సూరిబాబును హత్య చేసి, అది వడదెబ్బ కారణంగా జరిగిన మరణంగా చూపించే ప్రయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.ప్రాథమిక సమాచారం ప్రకారం, కుటుంబ కలహాల నేపథ్యంలో నాగమణి తన భర్త సూరిబాబును చున్నీతో మెడ బిగించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం అతడు వడదెబ్బకు గురై అకస్మాత్తుగా పడిపోయాడని చెప్పి ఆసుపత్రికి తరలించింది.అయితే వైద్యులు మృతదేహాన్ని పరిశీలించిన సమయంలో మెడపై అనుమానాస్పద గాయాలు కనిపించడంతో విషయం బయటపడింది. వైద్యుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.దర్యాప్తులో భాగంగా నాగమణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, హత్య వెనుక కుటుంబ వివాదాలున్నాయా? లేక ఇన్సూరెన్స్ డబ్బుల కోసమా అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.ఈ ఘటన భీమిలి ప్రాంతంలో సంచలనం సృష్టించింది.
next post

