Tv424x7
Andhrapradesh

నిర్లక్ష్యం కారణంగా ముక్కు పచ్చలారని పసి బాలుడు మృతి

పులివెందుల పట్టణంలోని స్థానిక శ్రీ మహాలక్ష్మి దేవస్థానం వద్ద ఆదివారం సాయంత్రం ఘోర దుర్ఘటన జరిగింది. ముక్కు పచ్చలారని 10 నెలల పసి బాలుడు దేవస్థాన నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా అసువులు బాసాడు. వివరాల్లోకి వెళితే పులివెందుల పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం కాంపౌండ్ వాల్ కు గల గేట్ మీద పడి ఆదివారం సాయంత్రం 6:30 నిమిషాలకు సాకేత్ అభినవ్ రెడ్డి అనే 10 నెలలు బాలుడు మృతి చెందాడు. పులివెందుల పట్టణం లోని మౌన స్వామి గుడి వద్ద నివాసం ఉంటున్న గజ్జల అశోక్ రెడ్డి, హిమజ ఆదివారం సాయంత్రం వాకింగ్ చేస్తూ సేద తీరేందుకు దేవాలయం వద్ద విశ్రమించారు. వారి కుమారుడు అయినా సాకేత్ అభినవ్ రెడ్డి దేవాలయం ప్రహరీ గోడ గేటు వద్దకు వెళ్లి ఆడుకుంటుండగా ఒకసారిగా గేటు మీద పడడం తో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన బాలుని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కొరకు కడపకు తరలించగా అదే రోజు రాత్రి ఎనిమిది గంటల 30 నిమిషాలకు చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన పై బాలుని బంధువులు పదిమంది వస్తూ పోతుండే దేవస్థానం వద్ద ఈ విధంగా ఆలయ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Related posts

చిన్నసింగన పల్లె సచివాలయం పరిధిలో _ఆంధ్ర ప్రదేశ్ కి జగన్ యే ఎందుకు కావాలంటే

TV4-24X7 News

కాంగ్రెస్ పార్టీ గూటికి సునీత

TV4-24X7 News

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత అలవర్చుకోవాలి

TV4-24X7 News

Leave a Comment