Tv424x7
Andhrapradesh

నేడు టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల

టీడీపీ-జనసేన పార్టీలు దూకుడును పెంచాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేశాయి. ఇవాళ టీడీపీ – జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది..ఉదయం 11 గంటల తర్వాత అభ్యర్థుల తొలి జాబితాను చంద్రబాబు – పవన్ విడుదల చేయనున్నారు. 60-70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను చంద్రబాబు – పవన్ ప్రకటించనున్నారు. 50కి పైగా టీడీపీ, 10కి పైగా జనసేన స్థానాల్లో అభ్యర్థులను టీడీపీ – జనసేనలు ప్రకటించనున్నాయి.ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం తొమ్మిది గంటలకల్లా అందుబాటులో ఉండాలని పలువురి నేతలకు చంద్రబాబు సూచించారు. నాదెండ్ల సహా ఇతర ముఖ్య నేతలతో పవన్‌ భేటీ కానున్నారు. బీజేపీతో సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చాక రెండో విడత అభ్యర్థుల జాబితాను కూటమి పార్టీలు ప్రకటించనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ సీట్లల్లో అభ్యర్థుల ప్రకటనకే టీడీపీ – జనసేన పరిమితం కానుంది. బీజేపీతో పొత్తు క్లారిటీ వచ్చాక ఎంపీ సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశముందని కూటమి పార్టీల వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు బీజేపీతో పొత్తుపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి జాబితా సిద్ధం కాలేదని తెలుస్తోంది. తొలి జాబితాతో పార్టీ నాయకుల్లో జోష్‌ నింపేందుకు నిర్ణయించినట్లు సమాచారం..

Related posts

సూరాడ రాజు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

జూలై నుంచి ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్‌.. !

TV4-24X7 News

చట్టం వారి చుట్టం అనుకున్నారు

TV4-24X7 News

Leave a Comment