Tv424x7
Andhrapradesh

చట్టం వారి చుట్టం అనుకున్నారు

ఎస్ఐ పై చీటింగ్ కేసు ఏలూరులో సీఐ,ఎస్ ఐ లు, కానిస్టేబుళ్ల పై కేసు నమోదు.పోలీసు స్టేషన్లో ఓ వ్యక్తిని కొట్టారనే అభియోగంపై కోర్టు ఆదేశాల మేరకు సీఐ, ఇద్దరు ఎస్.ఐ లు, అయిదుగురు కానిస్టేబుళ్ల పై కేసు నమోదైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఏలూరు సత్రంపాడుకు చెందిన అవుటుపల్లి సీతయ్య 2021లో ఏలూరు పాత బస్టాండులోని అప్పలరాజు హోటల్ కు వెళ్లి భోజనం చేశారు. బిల్లు చెల్లించే విషయంలో ఇతనికి, హోటల్ నిర్వాహకులకు గొడవ జరిగింది.సీతయ్య టూటౌన్ పోలీసుస్టేషన్కు వచ్చి హోటల్ నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు గురించి స్టేషన్కు వెళ్లిన సమయంలో తనతో అప్పటి సీఐ ఆదిప్రసాద్,ఎస్సైలు నాగబాబు, కిషోర్బాబు దురుసుగా ప్రవర్తించారని, కానిస్టేబుళ్లతో కలిసి కొట్టారని సీతయ్య మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని విన్నవించారు. కమిషన్ సూచనల మేరకు కోర్టులో ప్రైవేటు కేసు వేశారు.విచారించిన మొబైల్ కోర్టు బాధ్యులపై కేసు నమోదు చేయా లని ఆదేశించడంతో త్రీటౌన్ సీఐ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఎస్సై ప్రసాద్ అప్పట్లో టూటౌన్ సీఐగా పని చేసిన ఆదిప్రసాద్, ఎస్సైలు నాగబాబు, కిషోర్బాబు, కానిస్టేబుళ్లు వెంకటసత్యనారాయణ, రవికుమార్, శ్రీనివాసరావు, జీవరత్నం, రాజేష్ లపై మంగళవారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మరోపక్క ఎస్సై కిషోర్ బాబు పై చీటింగ్ కేసు నమోదు చేయాలని మొబైల్ కోర్టు పోలీసులకు ఆదేశించడంతో ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై కిషోర్ బాబు పై మరో చీటింగ్ కేసు నమోదు చేశారు.

Related posts

స్ట్రెట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేస్తానంటున్న ఫరూక్ బీజేపీ కండువాలు ఎందుకు వేసుకోవడంలేదో చెప్పాలి.. శిల్పా రవి

TV4-24X7 News

పోలవరంలో డీ వాటరింగ్ ప్రారంభం

TV4-24X7 News

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మూసివేత వాయిదా

TV4-24X7 News

Leave a Comment