కడప జిల్లా దువ్వూరు మండలం పెద్ద సింగనపల్లె గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ పద్మావతి (50) గుండెపోటుతో బుధవారం మృతి చెందారు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, బుధవారం తెల్లవారుజామున ఛాతిలో నొప్పి ఉందని ఆమె భర్త జొన్నవరం రామచంద్రారెడ్డికి తెలియజేయగా, వెంటనే ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పద్మావతి కన్నుమూశారు.
మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పద్మావతి ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె మృతికి గ్రామ ప్రజలు, సహచర అంగన్వాడీ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: