ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన తుదిక శ్రీనివాస్ విశ్వనాథ్‌ను వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నల్ల పోతుల నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారంపై ఇరువురి మధ్య సానుకూలంగా చర్చ జరిగింది.ప్రొద్దుటూరును పారిశుద్ధ్య లోపాల నుంచి పూర్తిగా విముక్తం చేసి, పరిశుభ్రమైన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలని నాగరాజు కమిషనర్‌ను కోరారు. పట్టణ అభివృద్ధికి అడ్డంకిగా మారే అంశాలను కట్టడి చేస్తూ ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై స్పందించిన కమిషనర్ తుదిక శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ, బాధ్యతలు స్వీకరించి పది రోజులు కూడా కాలేదని, త్వరలోనే ప్రొద్దుటూరును రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీలలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కమిషనర్ సానుకూల దృక్పథాన్ని, అభివృద్ధిపై ఆయన ప్రణాళికలను వాల్మీకి డైరెక్టర్ నల్ల పోతుల నాగరాజు అభినందించారు. అనంతరం కమిషనర్‌కు పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: