దువ్వూరులో తాగునీటి పైపులైన్ సమస్యకు పరిష్కారం

దువ్వూరు గ్రామంలోని మాదిగవాడలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా స్థానిక ప్రజలు తమ తాగునీటి పైపులైన్ సమస్యను టీడీపీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సమస్యను మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి గ్రామపంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి మాదిగవాడలో తాగునీటి పైపులైన్ సమస్యను ఈరోజు పరిష్కరించారు.

సమస్యను వెంటనే పరిష్కరించడంతో స్థానిక ప్రజలు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *