పులివెందుల: పులివెందుల మున్సిపాలిటీ అంశంపై టీడీపీ నేత బీటెక్ రవి వైఎస్సార్‌సీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఓటమి భయంతోనే వైఎస్సార్‌సీపీ కోర్టును ఆశ్రయించిందని ఆరోపించారు.
“దమ్ముంటే కోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుని ప్రజాక్షేత్రంలో నేరుగా ఎన్నికలను ఎదుర్కోవాలి. ప్రజలు ఓటు వేసి తమ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కల్పించాలి” అని బీటెక్ రవి అన్నారు.
వార్డుల మార్పుల పేరుతో రాజకీయ డ్రామాలు చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ ఎన్నికల ప్రక్రియ కొనసాగాలని డిమాండ్ చేశారు.
పులివెందుల రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: