దువ్వూరు మండలం చిన్న సింగనపల్లె గ్రామంలో కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
చిన్న సింగనపల్లె గ్రామంలోని నారుపల్లె సుబ్బారెడ్డి మినరల్ వాటర్ సమీపంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి వైఎస్ అవినాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
దువ్వూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఇరగంరెడ్డి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అఖిలభారత రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు నారుపల్లె విజయ భాస్కర్ రెడ్డి, ఇరగంరెడ్డి పద్మనాభరెడ్డి, అమ్మిరెడ్డి వెంకట నాగిరెడ్డి, బొమ్ము ఓబుల్ రెడ్డి, అమ్మిరెడ్డి చిన్న నాగిరెడ్డి, నారుపల్లె వెంకటసుబ్బారెడ్డి, బొమ్ము కొండారెడ్డి, మైదుకూరు నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ చల్లపల్లి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
అలాగే తుమ్మల రాజేష్ కుమార్ రెడ్డి, పల్లె వెంకట లక్ష్మి రెడ్డి, ఇరగంరెడ్డి బాల అంకిరెడ్డి, మద్దా నారాయణరెడ్డి, ఇరగంరెడ్డి రమణారెడ్డి, ఇరగంరెడ్డి నాగలింగేశ్వరరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైఎస్ అవినాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: