ఒరిజినల్ సర్టిఫికెట్లు, మార్కుల జాబితా మిస్సింగ్..!
మైదుకూరు, సెప్టెంబర్ 22: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని మిట్టమానుపల్లె పంచాయతీ, మాచుగారిపల్లె గ్రామానికి చెందిన జంపంగి బాలరాజు, నరసమ్మ దంపతుల కుమారుడు జంపంగి అజయ్ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు.
అజయ్ ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ (EET) కోర్సు అభ్యసిస్తున్నారు. ప్రతిరోజూ మైదుకూరు బస్టాండ్‌కు చేరుకుని, అక్కడి నుంచి ఆర్టీసీ అద్దె బస్సు (పల్లె వెలుగు)లో కడప నగరంలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలకు ప్రయాణిస్తుంటారు.
ఈ క్రమంలో 2026 సెప్టెంబర్ 10న మైదుకూరు నుంచి కడపకు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో, మైదుకూరు–కడప ప్రధాన మార్గమధ్యలో తన బ్యాగులో ఉన్న ఒరిజినల్ సర్టిఫికెట్లు, మార్కుల జాబితా, రేషన్ కార్డు, పుస్తకాలు కనిపించకుండా పోయినట్లు అజయ్ తెలిపారు.
అప్పటి నుంచి ఆయా పత్రాల కోసం పలుచోట్ల వెతికినా ఇప్పటివరకు లభ్యం కాలేదని పేర్కొన్నారు.
తన ఒరిజినల్ సర్టిఫికెట్లు, రేషన్ కార్డు, ఇతర పత్రాలు ఎవరికైనా లభిస్తే వెంటనే సమాచారం అందించి సహకరించాలని అజయ్ తండ్రి జంపంగి బాలరాజు కోరారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
📞 9177134652
📞 8712351792
చిరునామా:
3/87, మాచుగారిపల్లె,
మైదుకూరు మండలం, మిట్టమానిపల్లె,
వైఎస్ఆర్ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 516173.
Save or share this story as a newspaper-style Epaper Clip: