యూపీలో బస్సులో భయానక మంటలు.. 9 మంది సజీవ దహనం

యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..
మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులు, పలువురికి తీవ్ర గాయాలు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఉత్తరప్రదేశ్: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి మహోబాకు వెళ్తున్న స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు సమాచారం.

మంటలు వేగంగా వ్యాపించడంతో 9 మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మంటలు చెలరేగడంతో కొందరు ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సు నుంచి దూకినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *