మైదుకూరు అర్బన్ సీఐగా డీ. హాజీవలి బాధ్యతల స్వీకరణ

మైదుకూరు: మైదుకూరు పట్టణ అర్బన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా డీ. హాజీవలి శనివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమై పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించే అంశాలపై సమీక్ష నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా సీఐ డీ. హాజీవలి మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులు లేదా నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

ప్రజలు తమకు ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి తెలియజేయవచ్చని తెలిపారు. మహిళలు, వృద్ధులు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ వినియోగించాలని సూచించారు.

అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదని సూచించారు.

ప్రజల సహకారంతో మైదుకూరు పట్టణంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగించేందుకు, నేరాల నియంత్రణకు కృషి చేస్తామని సీఐ డీ. హాజీవలి తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *