చేవెళ్ల: రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చేవెళ్ల మండలం గొల్లపల్లి వద్ద బైక్‌పై వెళ్తున్న కుటుంబాన్ని వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో భార్య, భర్త, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.
మృతులను మొయినాబాద్ మండలం మేడిపల్లికి చెందిన మధు, కుమ్మరి సావిత్రిగా గుర్తించినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు.
👉 చేవెళ్లలో ఘోర హిట్ అండ్ రన్ ఘటనతో విషాదం నెలకొంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: