Tv424x7
National

‘న్యుబెవాక్స్‌ 14’ టీకాపై క్లినికల్‌ పరీక్షల్లో సానుకూల ఫలితాలు – బీఇ లిమిటెడ్

చిన్న పిల్లల్లో న్యుమోకాకల్‌ అనే వ్యాధిని నివారించేందుకు నిర్దేశించిన టీకాను ఆవిష్కరించడంలో హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ (బీఇ) కీలక మైలురాయిని చేరుకుంది. న్యుబెవ్యాక్స్‌ 14; (బీఇ- పీసీవీ-14) అనే న్యుమోకాకల్‌ కంజుగేట్‌ వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్‌ పరీక్షల్లో ఎంతో సానుకూల ఫలితాలు లభించినట్లు సంస్థ మంగళవారం ఇక్కడ వెల్లడించింది. ‘వ్యాక్సిన్‌’  పీర్‌- రివ్యూ జర్నల్‌లో ఈ పరీక్షల ఫలితాలు ప్రచురించినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా 15 ప్రదేశాల్లో  6 నుంచి 8 వారాల వయస్సు గల 1290 మంది పసికందులపై ఈ టీకా ప్రయోగాలు నిర్వహించారు. 6-10-14 వారాలకు ఒక డోసు చొప్పున ఇచ్చి ఫలితాలు విశ్లేషించారు. ఈ టీకా భద్రత నిర్థారణ జరిగి, వ్యాధిని నివారించగల సత్తాను ప్రదర్శించినట్లు బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ వెల్లడించింది. చిన్న పిల్లలకు ఈ టీకా ఇవ్వవచ్చని నిర్థారణ అయినందున, టీకాను విడుదల చేయడానికి దగ్గరయ్యామని బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ ఎండీ మహిమా దాట్ల వివరించారు.

Related posts

చిరు, పవన్ను హత్తుకున్న మోదీ

TV4-24X7 News

బడ్జెట్‌ 2024: కేంద్రం ఫోకస్‌ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా!

TV4-24X7 News

నేడు కాంగ్రెస్‌ జనజాతర సభ.. తుక్కుగూడ నుంచే సమర శంఖం

TV4-24X7 News

Leave a Comment