👉 మే 14 వ తేదీ ఉదయం నుండి జూన్ 6 వరకు అమలు……….
కడప డి.ఎస్పీ ఎం.డి షరీఫ్కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈనెల 14 వ తేదీ ఉదయం నుండి జూన్ 6వ తారీకు వరకు జిల్లా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ (జిల్లా కలెక్టర్) జారి చేసిన సెక్షన్ 144 అమలులో ఉంటుందని కడప డి.ఎస్పీ ఎం.డి షరీఫ్ ఒక ప్రకటన లో తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు మరియు లోక్ సభకు సార్వత్రిక ఎన్నికలు – 2024 నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించడానికి మరియు ఎన్నికల నిర్వహణలో అవాంఛనీయ సంఘటనలను నివారించడం కోసం కడప నియోజకవర్గం పరిధిలోని కౌంటింగ్ సెంటర్ గా గుర్తించిన మౌలానా అబ్దుల్ కలాం నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) పరిసర ప్రాంతములో క్రింద తెలిపిన విధంగా సిర్ పిసి 1973 లోని సెక్షన్ 144 అమలులో ఉంటుందని తెలిపారు.
1. ఈ క్రింద తెలిపిన విషయాలపై మినహా ఇతర ఎటువంటి కార్యక్రమాలకు 05 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడడం సెక్షన్ 144 క్రింద నేరంగా పరిగణించబడుతుంది.
2. బహిరంగ సభలకు మరియు ఇతర ఎటువంటి ఎన్నికల ప్రచారానికైనా ముందస్తు అనుమతులు తప్పనిసరి.
3. బహిరంగ ప్రదేశాలలో పటాసులను కాల్చడం నిషిద్ధం.ఈ నియమ నిబంధనలు జూన్ 6 వరకు ఉంటాయని కడప డి.ఎస్పీ తెలిపారు. ఈ నియమ నిబంధనలు ఏ వ్యక్తి అయినా పాటించకపోతే ఐపిసి సెక్షన్ 188 కింద శిక్షార్హులు అవుతారని డి.ఎస్పీ ఎం.డి షరీఫ్ తెలిపారు. తదుపరి మే నెల ఒకటో తేదీ నుంచి 31 వ తేదీ వరకు కడప పోలీసు సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందని కడప డీ.ఎస్పీ శ్రీ ఏం.డి. షరీఫ్ గారు మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలoటే 24 గంటల ముందు లిఖితపూర్వకంగా పోలీసు వారికి అర్జి ఇచ్చి వారి నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అలా కాని పక్షములో చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని కడప డి.ఎస్పీ ఎం.డి షరీఫ్ తెలిపారు.