విఖపట్నం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సిటీ ఆపరేషన్ సెంటర్ను కమిషనర్ సంపత్ కుమార్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ అందుతున్న సేవలను పర్యవేక్షక ఇంజనీర్ వినయ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. సెంటర్ ఉద్యోగుల వివరాలు, విధులు, ప్రతిరోజూ వస్తున్న ఫిర్యా దులు, పరిష్కరణపై ప్రజాభిప్రాయాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అందిస్తున్న సమాచార వివరాలు ఫ్లూయింటిగ్రిడ్ ప్రాజెక్టు మేనేజరు శ్రీనివాస్, ఆపరే షన్స్ మేనేజరు సమీరా తెలిపారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్రజలతో సిటీ ఆపరేషన్స్ సెంటర్ సిబ్బంది గౌరవప్రదంగా మాట్లాడి, వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సీఓసీ ద్వారా అన్ని సర్వీసులు పూర్తిస్థాయిలో జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కార్యనిర్వాహక ఇంజనీరు సుబ్బారావు, స్మార్ట్ సిటీ మేనేజర్ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

previous post
next post