విశాఖపట్నం జెండా రూపకర్త పింగళి .వెంకయ్య జయంతిని శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారు ఘనంగా నిర్వహించారు, మరియు 100 అడుగుల భారీ జెండా ర్యాలీని, శ్రీ స్వామి వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్.సి .ఎం .ఎ . జహీర్ అహ్మద్, ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల రౌండ్ టేబుల్ సంస్థ చైర్మన్ మక్సుద్ అహ్మద్ వివేకానంద సంస్థ నుండి, రాణి బొమ్మ వరకు ఈ భారీ జెండా ర్యాలీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పింగళి. వెంకయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని, మరియు వెంకయ్య విగ్రహాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సంస్థ అధ్యక్షులు అప్పారావు, సంస్థ సభ్యులు గజపతి స్వామి,జి లక్ష్మణ్,యూ . ఎల్లాజీ,పి . అప్పలకొండ,డి . సత్తిబాబు, మరియు పి . సత్యవంతరావు సంస్థ మహిళా సభ్యులు ఉమాదేవి, సుజాత, రాణి, కనకమహాలక్ష్మి, రాజేశ్వరి, రమా ప్రియ, జనని మరియు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

previous post