విశాఖపట్నం ట్రాఫిక్ నిబంధనలపై వాహన డ్రైవర్లకు పరవాడ సిఐ ఆర్.మల్లికార్జునరావు అవగాహన కార్యక్రమం చేపట్టారు. సబ్ స్టేషన్, పరవాడ మండల పరిషత్ కూడలి, సింహాద్రి కూడలి, రాంకీ ఎస్ఈజెడ్ కూడలి, లంకెలపాలెం తదితర ప్రాంతాల్లో అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రహదారి భద్రత నిబంధనలను పాటించాలని సూచించారు. రోడ్ల పైన ఇష్టానుసారంగా వాహనాలను నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మితిమీరిన వేగంతోనూ, మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపొద్దని చెప్పారు.

previous post
next post