విశాఖపట్నం కంచరపాలెం శాంతి భద్రతల సిఐ గా వి. చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు స్టేషన్ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియ జీశారు. 1998 బ్యాచ్కు చెందిన ఆయన ఎస్ఐగా విజయనగరం జిల్లా బలిజపేట, సాలూరు, కొమరాడ స్టేషన్ లలో విధులు నిర్వహించారు. 2010లో సిఐగా పదోన్నతి పొందిన కొత్తవల న్, విజయనగరం, పలాస, రణస్థలం తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించి ప్రస్తుతం రేంజ్ విఆర్ నుండి కంచరపాలెం లాండ్ ఆర్డర్ సిఐ గా బాధ్యతలు స్వీకరించారు. స్టేషన్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన పెండింగ్ కేసులపై ఆరా తీశారు. నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి సిబ్బందిని సమన్వయ పరుస్తూ ముందుకు వెళ్తామన్నారు.

previous post