విశాఖపట్నం పాత నగరంలో ప్రసిద్ధి చెందిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా ఉప కమిషనర్ కె. శోభారాణి శుక్రవారంబాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకుచర్యలు తీసుకుంటామన్నారు. ట్రస్టు బోర్డు సభ్యులు అమెను పుష్పగుచ్చాలతో అభినందించారు. దేవస్థానం ఈ ఓ గా బాధ్యతలు స్వీకరిస్తున్న శోభారాణి సిహెచ్వి.రమణ, ఎఇఒ తిరుమలేశ్వరరావు శోభారాణికి శుభాకాంక్షలు తెలిపినవారిలో ఉన్నారు.
