Tv424x7
Andhrapradesh

39 వార్డ్ లలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం లో అన్ని వార్డులలో పూర్తైన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం ఎన్నికలలో సమయంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తానని హామీ సౌత్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళిక రూపకల్పన చేశానని స్పష్టం చేసిన ఎమ్మెల్యే రానున్న రోజులలో ప్రజలకు మరింత లబ్ధి చేకూరే విధంగా కృషిచేస్తాను ఈరోజు జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు ,సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ 39 వ వార్డులలో జరిగిన “ఇది మంచి ప్రభుత్వం ” కార్యక్రమంలో పాల్గొన్నారు.39 వార్డ్ ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం మత్స్యకార కళ్యాణ మండపం లో జరిగింది. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు 100 రోజుల కూటమి పాలన లో జరిగిన లబ్ధి గురించి వివరించారు. దక్షిణ నియోజకవర్గం లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ది చేస్తానని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లను తూ.చ తప్పకుండా పాటిస్తానిని హామీ ఇచ్చారు. ఇది ప్రజా ప్రభుత్వం అని, ప్రజలే పాలకులనీ తెలిపారు. నియోజకవర్గం లో అన్ని వార్డ్ లలో ఇది మంచి ప్రభుత్వ కార్యమాలను నిర్వహించామని అన్నారు. రానున్న రోజులలో ప్రతి సమస్యను నెరవేర్చుటకు మీ ముందుకు వస్తానని అన్నారు. కార్యక్రమంలో టిడిపి సౌత్ ఇన్చార్జి సుధాకర్, జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ , ఆయా అవార్డుల కార్పొరేటర్లు, కూటమి వార్డు అధ్యక్షులు , వివిధ హోదాలలో ఉన్న కూటమి నేతలు, జోనల్ కమిషనర్ నాయుడు, ఎపిడి పుణ్యవతి, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Related posts

ఎం ఆర్ పేట పోలీసుల విజిబుల్ పోలిసింగ్

TV4-24X7 News

వచ్చే వారం పోలవరంలో సీఎం పర్యటన.

TV4-24X7 News

15 రోజుల అనంతరం రేపు రాష్ట్రానికి తిరిగి రానున్న జగన్

TV4-24X7 News

Leave a Comment