Tv424x7
Andhrapradesh

వాహనాలను అదుపులోకి తీసుకున్న పి ఎం పాలెం ట్రాఫిక్ పోలీసులు

విశాఖపట్నం పనోరమా హిల్స్ రోడ్ లో కొందరు ఆకాతయులు బైక్ రేసింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు అని రాబడిన సమాచారం మేరకు పీఎం పాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ జి . ప్రసాద్ మరియు ట్రాఫిక్ సిబ్బంది మరియు పీఎం పాలెం లా & ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ కె . భాస్కర రావు మరియు లా & ఆర్డర్ సిబ్బంది పైన తెలిపిన స్థలానికి వెళ్లి కాపు కాయగా, మూడు ద్విచక్రవాహనాలపై ఐదుగురు వ్యక్తులు పనోరమా ఐ టీ సెజ్ రోడ్ నుండి ఋషికొండ వైపు వారియొక్క వాహనాలపై అతివేగముగా, నిర్లక్ష్యంగా, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ, విన్యాసాలు చేస్తూ వాహనదారులకు మరియు ప్రజలకు హాని తలపెట్టే విధంగా రేసింగ్ లు చేస్తూవుండగా పోలీస్ సిబ్బంది చాకచక్యంగా వారిని ఆపి అదుపులోనికి తీసుకుని వారి వివరాలు అడుగగా వారి పేర్లు 1) ఒమ్మి తానోజ్ s/o శ్రీనివాస రావు , ఏజ్ 18 Yrs, యాదవ బై క్యాస్ట్ , బ్లాక్ No-7, వుడా క్వార్టర్స్ , రమణ , విశాఖపట్నం సిటీ , 2) జార్జ్ రిచర్డ్ సాంగ్ లే్విన్ s/o జాన్సన్ లే్విన్ , ఏజ్ 18 Yrs, క్యాస్ట్ క్రిస్టియన్ , r/o ఫ్లాట్ No 402, కేశవప్రగాఢ అపార్ట్మెంట్ , శ్రీనగర్ , రామటాకీస్ , విశాఖపట్నం సిటీ , 3) మోపడం వాసు s/o నరసింగ రావు , ఏజ్ 18 yrs , r/o D.No. 12-10-3/6A, జేక్ ప్రిన్స్ ఫస్ట్ స్ట్రీట్ , రెడీణం గార్డెన్స్ , రమణ , విశాఖపట్నం సిటీ , 4) షైక్ అర్మన్ , S/o షైక్ కుర్బన్ లేట్ , ఏజ్ 18 Yrs, r/o నియర్ విద్యావడం స్కూల్ , నీలమ్మవేప చెట్టు , విశాఖపట్నం city, 5) వాసుపల్లి జ్ఞానేశ్వరి s/o ధనరాజు , ఏజ్ 18 Yrs, r/o D.No. 30-4-38, ఆర్ .కె .ఫ్యామిలీ స్టోర్ బ్యాక్ సైడ్ , ధాబాగార్డెన్స్ , విశాఖపట్నం సిటీ అని తెలిపినారు. అంతట వారు నడుపుతున్న వాహనాలు 1) AP39NR1426, 2) AP40CR5792, 3) AP40BD2656 అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి వారి వారి తల్లిదండ్రులను స్టేషన్ కి పిలిపించి నార్త్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన ఎస్ కాంతారావు వారికి కౌన్సిలింగ్ చేసి పైన తెలిపిన అరుగురుపైన లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో కేసు నెంబర్ 579/2024 గా నమోదు నమోదు చేసినారు. సెక్షన్ 206 ఆమెండమెంట్ ఎం వి యాక్ట్ ప్రకారం బైక్ రేసింగ్ చేస్తున్నవారిని Sec 189 ప్రకారం వారి యొక్క లైసెన్సు మూడు నెలలు రద్దు చేయుటకు లైసెన్సు అథారిటీకి రిక్కమొండ్ చేయబడును. రెండవ సారి రేసింగ్ చేస్తు దొరికితే శాశ్వతంగా వారి డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేయుటకు లైసెన్సు అథారిటీకి రిక్కమొండ్ చేయబడును. పిల్లలు యొక్క తల్లిదండ్రులు ఖరీదైన మోటార్ సైకిల్ మరియు ఖరీదైన సెల్ఫోన్లు పిల్లలకి ఇచ్చి వారి భవిష్యత్తును నాశనం చేయవద్దు అని పోలీసువారి విన్నపం.

Related posts

తిరుమలకు ఎన్డీబీ ల్యాబ్ పరికరాలు

TV4-24X7 News

తిరుమలలో ఏప్రిల్ 2న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

TV4-24X7 News

32వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టండి కార్పొరేటర్ కందుల నాగరాజు

TV4-24X7 News

Leave a Comment